శ్రీలంకతో(Sri Lanka) జరుగుతున్న టెస్టు సిరీస్‌లో(Test Series) టీమిండియా (Team India) మరో విజయంపై కన్నేసింది. గాలెలో(Galle) జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఆగస్టు 23 నుంచి కొలంబో(Colombo) వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. తొలి టెస్టులో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) 10 వికెట్లతో అదరగొట్టడంతో అతడికి మరోసారి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే రెండో టెస్టులో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) స్థానంలో 33 ఏళ్ల దేశవాళీ ఆల్‌రౌండర్ సారంశ్ జైన్‌ను (Saransh Jain) ఆడించే అంశాన్ని టీమ్ మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి టెస్టులో కుల్దీప్ 25 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చినా వికెట్లు తీయలేకపోయాడు. మరోవైపు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ (Manav Suthar)ప్రభావవంతంగా బౌలింగ్ చేయడంతో కుల్దీప్ స్థానంపై చర్చ మొదలైంది.
మధ్యప్రదేశ్‌కు(Madhya Pradesh) చెందిన సారంశ్ జైన్ రైట్‌హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉండటంతో తుది జట్టులోకి వస్తే భారత్‌కు అదనపు బ్యాటింగ్ బలం కూడా లభించనుంది. దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 181 వికెట్లు, 2,223 పరుగులు సాధించిన సారంశ్.. 2014లో అరంగేట్రం చేసి సుమారు 12 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. ఒకవేళ కొలంబో టెస్టులో అరంగేట్రం చేస్తే ఆలస్య వయసులో టీమిండియాకు టెస్టు అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నాడు. ఇక ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) తొలి టెస్టులో అర్ధసెంచరీ చేయడంతో అతడికే మరో అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సర్ఫరాజ్ ఖాన్‌కు (Sarfaraz Khan) తుది జట్టులో చోటు కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. పేస్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌ను (Mohammed Siraj) కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉండగా.. గర్నూర్ బ్రార్‌ను ఆడించే ఆలోచన ఉన్నప్పటికీ కీలకమైన రెండో టెస్టులో బౌలింగ్ కాంబినేషన్ మార్చేందుకు టీమ్ మేనేజ్మెంట్ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని తెలుస్తోంది.








