హైదరాబాద్: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ

హైదరాబాద్: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ

Summarize with AI

తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా టీజీఎస్‌ఆర్టీసీ కీలక అడుగు వేస్తోంది. మీసేవ ఆధ్వర్యంలో ‘మీటికెట్‌ (MeeTicket)’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ వంటి వివిధ రవాణా సేవలను ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడం ఈ యాప్‌ ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణానికి అనుగుణంగా ఆర్టీసీ లేదా మెట్రో టికెట్‌తో పాటు గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆటో, క్యాబ్‌లను కూడా ముందుగానే బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకే డిజిటల్‌ వేదికపై ప్రయాణానికి సంబంధించిన సేవలు అందుబాటులోకి రావడంతో సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం మరింత సులభతరం కానుంది. చెల్లింపుల ప్రక్రియను కూడా సులభతరం చేస్తూ, ప్రయాణికులు చెల్లించిన మొత్తాన్ని సంబంధిత రవాణా విభాగాలు, భాగస్వాములకు ఆటోమేటిక్‌గా జమ చేసే విధానాన్ని ఇందులో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇదిలా ఉండగా, టీజీఎస్‌ఆర్టీసీ సొంతంగా ఆటోలను కొనుగోలు చేసి నడపబోతోందంటూ సోషల్‌ మీడియా, కొన్ని పత్రికల్లో జరుగుతున్న ప్రచారంపై యాజమాన్యం స్పష్టతనిచ్చింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలను కొనుగోలు చేయడం, నిర్వహించడం వంటి ప్రతిపాదనలు ప్రస్తుతం లేవని, భవిష్యత్తులోనూ అలాంటి ఆలోచన లేదని వెల్లడించింది. ‘మీటికెట్‌’ యాప్‌ ద్వారా ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, ఇతర రవాణా భాగస్వాములను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించి ప్రయాణికులకు సేవలు అందించడమే ఉద్దేశమని స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని టీజీఎస్‌ఆర్టీసీ కోరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment