కేంద్ర ప్రభుత్వం 2025 జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. వివిధ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థలకు ఈ పురస్కారాలను అందించనున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రిటైర్డ్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు.
17 మందికి అర్జున అవార్డులు
క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను కేంద్రం ప్రకటించింది.
తేజస్విన్ శంకర్ – అథ్లెటిక్స్
ముహమ్మద్ అజ్మల్ వి – అథ్లెటిక్స్
ప్రియాంక గోస్వామి – అథ్లెటిక్స్
ట్రీసా జాలీ – బ్యాడ్మింటన్
పుల్లెల గాయత్రి గోపీచంద్ – బ్యాడ్మింటన్
నరేందర్ – బాక్సింగ్
విదిత్ సంతోష్ గుజరాతీ – చదరంగం
దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్ – చదరంగం
ధనుష్ శ్రీకాంత్ – డెఫ్ షూటింగ్
లాల్‌రెమ్సియామి – హాకీ
రాజ్‌కుమార్ పాల్ – హాకీ
సుర్జీత్ – కబడ్డీ
పూజ – కబడ్డీ
రుద్రాంశ్ ఖండేల్వాల్ – పారా షూటింగ్
ఏక్తా భ్యాన్ – పారా అథ్లెటిక్స్
అరవింద్ సింగ్ – రోయింగ్
అఖిల్ షియోరాన్ – షూటింగ్
అలాగే ఐ. అరుమైనాయగంకు ఫుట్‌బాల్ విభాగంలో అర్జున పురస్కారం (జీవితకాల పురస్కారం) ప్రకటించారు.
క్రీడాకారులను తీర్చిదిద్దడంలో విశేష సేవలందించిన ముగ్గురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను ప్రకటించారు.
పర్వీర్ సింగ్ – అథ్లెటిక్స్
ఛోటే లాల్ యాదవ్ – బాక్సింగ్
నేహా నందకుమార్ చవాన్ – షూటింగ్
ఇక ద్రోణాచార్య జీవితకాల పురస్కారాలకు ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (కుస్తీ) ఎంపికయ్యారు.
సంస్థలకు కూడా పురస్కారాలు
క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహానికి విశేష కృషి చేసిన సంస్థలకు కూడా జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఆర్మీ పారాలింపిక్ నోడ్, పూణేకు రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ప్రకటించారు. క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థలకు వివిధ విభాగాల్లో ప్రకటించిన ఈ పురస్కారాలు దేశంలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల విజయాలను గుర్తించే ఉద్దేశంతో అందించనున్నారు.








