అద్దంకిలో ప్ర‌మాదం.. ఎస్సైల కారు డిక్కీలో గంజాయి

అద్దంకిలో ప్ర‌మాదం.. ఎస్సైల కారు డిక్కీలో గంజాయి

Summarize with AI

ప్ర‌మాదానికి గురైన పోలీసుల కారులో(Police Car) గంజాయి (Ganja) ప‌ట్టుప‌డింది. ప్రకాశం జిల్లా(Prakasam District) అద్దంకి సమీపంలో ఇద్దరు ఎస్సైలు (SIs)ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొన్న ఘటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బల్లికురవ ఎస్సై నాగరాజు(SI Nagaraju), సంతమాగుళూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు (SI Nagamalleswara Rao) సివిల్‌ డ్రెస్‌లో స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో బల్లికురవ నుంచి అద్దంకి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అద్దంకి (Addanki) సమీపంలో పోలీసుల కారు ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కారును పరిశీలించిన స్థానికులు.. కారు డిక్కీలో(Car Boot) గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో కారును పూర్తిగా తనిఖీ చేయాలని స్థానికులు పట్టుబట్టారు. ఈ విషయం తెలియడంతో అద్దంకి సీఐ సుబ్బరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కారు డిక్కీని తెరిచి పూర్తిగా తనిఖీ చేయాలని స్థానికులు పట్టుబట్టగా.. సీఐ సుబ్బరాజు(Subbaraju) డిక్కీని ఓపెన్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో స్థానికులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కారు డిక్కీలో గంజాయి ఉందని, ఇద్దరు ఎస్సైలు సివిల్‌ డ్రెస్‌లో ప్రయాణిస్తుండటంతో పాటు.. కారును పూర్తిగా తనిఖీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎట్ట‌కేల‌కు కారు డిక్కీ ఓపెన్ చేయ‌గా అందులో పోలీస్ యూనిఫాం, గంజాయి ల‌భ్య‌మ‌య్యాయి.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇద్దరు ఎస్సైల‌ను అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం. గ్రామానికి చెందిన ఓ టీడీపీ(TDP) నాయకుడి కారులో ఇద్దరు ఎస్సైలను అక్కడి నుంచి పంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన ఆటో ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఇద్ద‌రు ఎస్ఐలు ప్ర‌యాణిస్తున్న కారులో ఏకంగా గంజాయి ప‌ట్టుబ‌డ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కారు డిక్కీలో గంజాయి ల‌భ్య‌మైన‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment