నేపాల్ అల్లర్ల వెనుక ఐఎస్ఐ కుట్ర? భారత సరిహద్దులో కలకలం

నేపాల్ అల్లర్ల వెనుక ఐఎస్ఐ కుట్ర? భారత సరిహద్దులో కలకలం

Summarize with AI

భారత్‌కు(India) సరిహద్దున ఉన్న నేపాల్‌లోని(Nepal) సున్సరి జిల్లాలో జూలై 26న చోటుచేసుకున్న కోమల ఘర్షణల(Communal Clashes) వెనుక పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సున్సరిలోని దేవ్‌గంజ్ గ్రామీణ పురపాలక పరిధిలోని కప్తాన్‌గంజ్(Kaptanganj) ప్రాంతంలో మతపరమైన జెండాలు, ఎక్కువ సౌండ్‌తో డీజే ప్లే చేయడంపై రెండు వర్గాల మధ్య మొదలైన చిన్న వివాదం తీవ్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేయిదాటడంతో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ హింస ఇతర ప్రాంతాలకూ వ్యాపించడంతో యంత్రాంగం కర్ఫ్యూ (Curfew) విధించాల్సి వచ్చింది. జూలై 31 నాటికి ఈ ఘటనల్లో కనీసం ముగ్గురు మరణించగా, 25 మందికి పైగా గాయపడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ ఘర్షణలపై నేపాల్ నిఘా సంస్థ (Nepal Intelligence Agency) ఆ దేశ హోం మంత్రిత్వ శాఖకు (Home Ministry) సమర్పించిన ప్రాథమిక నివేదికలో విదేశీ మత ప్రచారకుల కార్యకలాపాలు, సరిహద్దు ప్రాంతాల్లోని అనుమానాస్పద నెట్‌వర్క్‌లపై సమగ్ర విచారణ జరపాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నివేదికలో పాకిస్థాన్‌ మూలాలున్న (Pakistan-Origin) మౌలానా మహమ్మద్ ఇలియాస్ ఘుమాన్, ఖాట్మండు మసీదు ఇమామ్ ముఫ్తీ అబు బకర్ కాస్మీలు సున్సరిలో పర్యటించినట్లు ప్రస్తావించారు. భారత సరిహద్దులోని సున్నితమైన జిల్లాల్లో విదేశీ మత పెద్దలు పర్యటించారని ఆరోపణలు వచ్చినప్పటికీ, వారి సమక్షానికీ ఈ హింసకూ నేరుగా సంబంధం ఉందనే విషయాన్ని అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ ఘటనల నేపథ్యంలో నేపాల్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో మసీదులు, మదరసాల కార్యకలాపాలు, విదేశీ నిధుల (ఫండింగ్) వినియోగంపై తీవ్ర ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో భారత్‌లో నమోదైన కొన్ని కేసుల్లో నేపాల్ పౌరులు ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. 2025లో ఢిల్లీ పోలీసులు ఐఎస్ఐ మాడ్యూల్ కేసుకు సంబంధించి నేపాల్ పౌరుడైన ప్రభాత్ కుమార్ చౌరసియాను అరెస్ట్ చేశారు. అతని ద్వారా భారతీయ సిమ్ కార్డులను పాకిస్థాన్‌‌కు పంపినట్లు, అందులోని 16 సిమ్‌లలో 11 పాకిస్థాన్‌‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సున్సరి హింసాత్మక ఘటనల అనంతరం నేపాల్ ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అయితే, ఈ ఘటనల్లో ఐఎస్ఐ పాత్ర ఎంతవరకు ఉందనేది, విదేశీ నెట్‌వర్క్ గురించిన నిజానిజాలు ప్రభుత్వం చేపట్టిన పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాతే వెలుగులోకి రానున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment