రాష్ట్రంలోని భూ కేటాయింపులు(Land Allocations), టెసేరాక్ సంస్థ వ్యవహారం(Tesseract Company), ఓటర్ల జాబితా (Voters List) తదితర అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. టెసేరాక్ సంస్థకు ఒక్క ఉద్యోగి (Employee) కూడా లేకపోయినా, కేవలం రూ.లక్ష మూలధనంతో కంపెనీ ఏర్పాటు చేసి పఠాన్‌చెరులో(Patancheru) ఉన్నట్లు చూపించారని ఆరోపించారు.
అలాంటి సంస్థకు గజానికి రూ.7 వేల చొప్పున సుమారు రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించారని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (CM Revanth Reddy Government) ఈ భూమిని అప్పనంగా కట్టబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. అనుముల కొండల్‌రెడ్డి (Anumula Kondal Reddy) తనను తాను టెసేరాక్ చైర్మన్‌గా ప్రకటించుకున్నారని, ఆయన కుమారుడు సంస్థ తరఫున ఇంటర్వ్యూలు ఇవ్వడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై కర్ణాటకలో భూ కేటాయింపుల కేసులో లోకాయుక్తను ఆశ్రయించిన తరహాలో తెలంగాణలోనూ పోరాటం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
ఇక రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించే అవకాశం ఉందన్న ప్రచారంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 17న ఓటర్ల జాబితా విడుదల కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా కమిటీలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిందని, అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వరుణ యాగం (Varuna Yagam) పేరుతో ప్రజల దృష్టిని మళ్లించకుండా ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయాలని సూచించిన కేటీఆర్.. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో పంపులను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు (Palamuru-Rangareddy Project) జాతీయ హోదా విషయంలో (National Project Status) కాంగ్రెస్, బీజేపీ(BJP) ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా తీసుకురాలేకపోయారని, ‘‘8 ప్లస్ 8 ఈక్వల్ టు జీరో’’(8+8=0) అంటూ సెటైర్ వేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.








