డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్‌పై దాడికి య‌త్నం (Video)

డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్‌పై దాడికి య‌త్నం (Video)

Summarize with AI

రాజధాని అమరావతిలో (Amaravati) నిర్వహించిన ‘చిత్రకళా వీధి'(Chitrakala Veedhi) ప్రారంభోత్సవ ప్రాంగణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju) గన్‌మెన్‌కు(Gunman), జనసేన (Jana Sena) నాయకులు, కార్యకర్తలకు నడుమ తీవ్ర వాగ్వివాదం, తోపులాట, దాడి జరగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar), రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) సమక్షంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది?
చిత్రకళా వీధి ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌తో(Bonaboyina Srinivas) కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించేందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Raghurama Krishnam Raju) భద్రత బాధ్యతల్లో ఉన్న గన్‌మెన్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ను ముందుకు వెళ్లకుండా అడ్డుకుని పక్కకు నెట్టివేశారు.

సహచర నాయకుడిని సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడంతో ఆగ్రహానికి గురైన జనసేన కార్యకర్తలు, మంత్రి గన్‌మెన్లు వెంటనే స్పందించారు. డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్‌తో తీవ్రంగా వాగ్వివాదానికి దిగారు. అత‌న్ని నెట్టివేస్తూ దాడికి య‌త్నించారు.

ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదం ముదరడంతో ప్రాంగణమంతా అరుపులు, కేకలతో హోరెత్తిపోయింది. ఆగ్రహంతో రగిలిపోయిన జనసేన కార్యకర్తలు డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్‌ను పక్కకు తోసేసి, దాడికి య‌త్నించ‌డంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment