బీజేపీకి షాక్‌.. ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్నిక‌ల స్ట్రాట‌జిస్ట్‌

బీజేపీకి షాక్‌.. ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్నిక‌ల స్ట్రాట‌జిస్ట్‌

Summarize with AI

బీహార్ రాజకీయాల్లో (Bihar Politics)లో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీకి (BJP) 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న పట్నాలోని (Patna) బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన సురాజ్ పార్టీ (Jan Suraaj Party) అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor – PK) ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో ప్రశాంత్ కిషోర్ సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా, ఆయన స్థాపించిన జన సురాజ్ పార్టీ తన తొలి బోణీ కొట్టింది.

30 ఏళ్లకు పైగా బంకీపూర్ నియోజకవర్గంపై (Bankipur Constituency) బీజేపీ(BJP) తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది. అయితే ఈ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై (Neeraj Kumar) 18,953 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 31 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రశాంత్ కిషోర్ (జన సురాజ్) 63,203 ఓట్లు, నీరజ్ కుమార్ (బీజేపీ) 44,250 ఓట్లు, రేఖా కుమారి (ఆర్జేడీ) 14,085 ఓట్లు సాధించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ (Nitin Nabin) రాజ్యసభకు (Rajya Sabha) నామినేట్ అవ్వడంతో బంకీపూర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో నితిన్ నబీన్ తో పాటు ఆయన తండ్రి నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా (Naveen Kishore Prasad Sinha) కూడా ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. అలాంటి తిరుగులేని స్థానంలో పీకే విజయం సాధించడం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment