రానున్న 3 గంటలు అప్రమత్తం.. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

రానున్న 3 గంటలు అప్రమత్తం.. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రానున్న మూడు గంటల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (AP Disaster Management Authority) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు (Lightning Strikes) పడే అవకాశముందని హెచ్చరించారు.

అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పిడుగులు పడే అవకాశమున్న సమయంలో ప్రజలు చెట్ల (Trees) కింద, విద్యుత్ స్తంభాల (Electric Poles) సమీపంలో నిలబడవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రైతులు (Farmers), మత్స్యకారులు(Fishermen), బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు ప్రత్యేక అప్రమత్తత పాటించాలని అధికారులు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment