ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..

Summarize with AI

ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుతో నమోదైన కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ నిర్వహించి పలు కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అశోక్‌నగర్‌లోని అతని గదిలో నుంచి రెండు ప్రేమలేఖలు, ఒక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌తో పాటు కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ ఆధారాల ఆధారంగా కేసులోని వివిధ కోణాలను పరిశీలిస్తూ దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడనే ఆరోపణలపై కూడా పోలీసులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.

దర్యాప్తులో మరో మహిళతో కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహిత మహిళ భర్తతో విడిపోయిన అనంతరం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, ఆమెతో ఉదయ్ సన్నిహితంగా మెలిగినట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. అయితే విడాకుల తర్వాత తనతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి, ఆ మహిళ కలుసుకుని ఉదయ్ ప్రవర్తనపై తమ అనుభవాలు పంచుకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 20 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment