మోదీని బాబు దూషించినప్పుడు కన్నీళ్లు రాలేదా..?

మోదీని బాబు దూషించినప్పుడు కన్నీళ్లు రాలేదా..?

Summarize with AI

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం పోరాడుతున్న ‘జెన్ జీ’ (Gen Z) యువతను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భోగాపురం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ సేవలను కొనియాడుతూ.. దేశం కోసం ప్రధాని మోదీ పడ్డ కష్టం మరెవరూ పడలేదని, ఒక్క సెల‌వు కూడా తీసుకోకుండా ప‌నిచేస్తున్నార‌న్నారు. “ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొందరు ప్రధాని మోదీని అనకూడని మాటలు అంటుంటే చూసి నా గుండె క‌దిలింది.. కన్నీళ్లు వచ్చాయి. దేశం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా?” అని ఆవేదన చెందాను అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

తనను ఎంతగా దూషించినా పెద్ద మనసుతో క్షమించే గుణం మోదీదని, ఇలాంటి నాయకుడికి దేశం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. నేటి యువతకు (జెన్ జీ) ప్రధాని పడే కష్టం ఏం తెలుసని, వారికి సరైన సంస్కారం నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వీడియోలు కూడా బయటపడుతున్నాయి.

ప్రశ్నిస్తే సంస్కారహీనమా?.. మ‌రి చంద్ర‌బాబుది
అధికారంలోకి రాకముందు “ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను” అని గంభీరంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఎక్కిన తర్వాత విద్యార్థులు, యువత ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ‌రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వేదిక‌గా ప్ర‌ధాని మోడీని, ఆయ‌న భార్య‌ను, త‌ల్లిని ఉద్దేశించిన అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌న్నీరు రాలేదా..? అని ప్ర‌శ్నిస్తున్నారు.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తలకిందులు చేసిన నీట్ (NEET) పేపర్ లీకేజీ ఘటనపై కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జెన్ జీ యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద పోరాటం చేసింది. పోలీసుల లాఠీ దెబ్బలను సైతం ఓర్చుకుని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పట్టువదలకుండా ఉద్యమించింది. అన్యాయం జరిగినప్పుడు నిలదీయడమే ప్రజాస్వామ్య లక్షణం కాగా, దాన్ని పవన్ కళ్యాణ్ “సంస్కారం లేకపోవడం” అనడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

‘ప్రశ్నించే హక్కు’ ఎటుపోయింది?
గతంలో ప్రజల వైపు నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్, ఇప్పుడు నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తున్న ‘జెన్ జీ’ తరాన్ని తప్పుబట్టడం ఆయన రాజకీయ వైఖరిలోని ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాని మోదీ సెలవులు తీసుకోలేదని లేదా ఆయన వ్యక్తిత్వాన్ని పొగడటంలో తప్పులేకపోయినా, దానికోసం విద్యార్థుల నిరసనలను, యువత ఆక్రోశాన్ని “అపచారం”గా చిత్రీకరించడం భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయడమేనని విమర్శకులు అంటున్నారు.

దేశానికి వెన్నుముకగా నిలిచే యువత తమ హక్కుల కోసం, విద్యా వ్యవస్థలోని లోపాలపై గళమెత్తితే మెచ్చుకోవాల్సింది పోయి.. వారిని సంస్కారం లేనివారిగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ నాయకత్వ పరిణతిని ప్రశ్నించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment