చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story) ఓవర్సీస్‌లోనూ (Overseas) అదిరిపోయే వసూళ్లతో (Collections) దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా (Romantic Emotional Drama) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
ముఖ్యంగా ఉత్తర అమెరికాలో (North America) ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తుండగా, విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 5 లక్షల డాలర్ల (500K) గ్రాస్ మార్క్‌ను (Gross Mark) దాటినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు రవి నంబూరి (Ravi Namburi) తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ దిశగా విజయవంతంగా దూసుకెళ్తుండగా, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన ఓవర్సీస్ చిత్రాల్లో ఒకటిగా నిలిచే దిశగా పయనిస్తోంది.
ప్రేమకథ, పెళ్లి వంటి సన్నివేశాలను భావోద్వేగాలకు దగ్గరగా ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువత కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ చూపుతుండటం వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సరసన శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) కథానాయికగా నటించగా, వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎస్.కె.ఎన్(SKN), సాయి రాజేష్ (Sai Rajesh) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కథను సాయి రాజేష్ అందించగా, మణిశర్మ (Mani Sharma) స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ రాబోయే రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.








