ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ప్రధాని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో NTPC నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌కు పీఎం మోదీ శంకుస్థాపన చేస్తారు. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి అనేక ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఈనెల 4న జరిగే నేవీ డే పరేడ్, 8న జరిగే ప్రధాని సభలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు, కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారు.
News Wire
-
01
మామిడి రైతులపై యుద్ధం ప్రభావం
విదేశాల్లో తెలుగురాష్ట్రాల మామిడికి డిమాండ్. ప్రతి ఏటా గల్ఫ్ దేశాలకు భారీగా మామిడి ఎగుమతి
-
02
వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్
-
03
గుంతకల్లులో జనసేన నేత వీరంగం
ఫీజు అడిగినందుకు శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ పై బండి శేఖర్ దాడి. ఏడాదిగా కూతురు పీజు చెల్లించని బండి శేఖర్.
-
04
విశాఖ స్టీల్ పై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్..
స్టీల్ ప్లాంట్ లో క్రమంగా పడిపోతున్న ఎల్పీజీ నిల్వలు. వైజాగ్ స్టీల్ లో రోజుకు 12-13 టన్నుల ఎల్పీజీ వినియోగం.
-
05
అలిపిరి దగ్గర భారీగా నగదు పట్టివేత
రూ.65 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టీటీడీ విజిలెన్స్.
-
06
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
టీం ఇండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నజరానా. T20-2026 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం
-
07
పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్
గ్యాస్ కొరతతో ముంబైలో 20 శాతం హోటళ్లు బంద్. పరిస్థితి ఇలానే కొనసాగితే 50 శాతం హెటళ్లు మూతపడే అవకాశం.
-
08
గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ
ఏపీలో జనాభా, ఆదాయం ఆధారంగా పంచాయతీల పునర్ వర్గీకరణ. 10వేల జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలుగా నిర్ణయం.
-
09
చమురుశుద్ధి సంస్థలపై ఎస్మా
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు కృత్రిమ కొరత ష్టించకుండా కేంద్రం నిర్ణయం. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా చర్యలు.
-
10
మార్చి 7 వరకూ అసెంబ్లీ సమావేశాలు
17 పనిదినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 14న వార్షిక బడ్జెట్.








