మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నడుమ అమెరికాతో (United States) కాల్పుల విరమణ (Ceasefire) చర్చలకు ఇరాన్ (Iran) సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇందుకు ముందు మూడు కీలక షరతులను (Three Key Conditions) అంగీకరించాలని టెహ్రాన్ (Tehran) స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై తమ నియంత్రణ కొనసాగాలని, దానికి ప్రత్యామ్నాయ సముద్ర మార్గాల ప్రతిపాదనలను అంగీకరించబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. అలాగే అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై కాల్పుల విరమణ తర్వాత మూడో దశలో ప్రత్యేకంగా చర్చలు జరపాలని తన వైఖరిని వెల్లడించింది.
చర్చల వేదిక విషయంలో కూడా ఇరాన్(Iran) సానుకూల సంకేతాలు ఇచ్చింది. జెనీవా(Geneva), దోహా (Doha) లేదా ఇస్లామాబాద్ (Islamabad) వంటి నగరాల్లో ఎక్కడైనా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అయితే హర్మూజ్ జలసంధిపై (Strait of Hormuz) తమ హక్కులు, భద్రతా ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మరోసారి స్పష్టం చేసింది. దీంతో కాల్పుల విరమణ చర్చలకు మార్గం సుగమమవుతుందా? లేక ఇరాన్ విధించిన షరతుల కారణంగా చర్చలు మరింత క్లిష్టంగా మారతాయా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.








