నకిలీ మందుల ఉత్పత్తిపై హెల్త్ మినిస్టర్ సంచలన నిర్ణ‌యం

నకిలీ మందుల ఉత్పత్తిపై హెల్త్ మినిస్టర్ సంచలన నిర్ణ‌యం

Summarize with AI

నకిలీ మందులు తయారు చేస్తున్న వారికి కఠిన చర్యలు తప్పవని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. బుధవారం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక రిపోర్టును ఆవిష్కరించిన సందర్భంగా, రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణను బలోపేతం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పనితీరు మెరుగుపరచడం ద్వారా నిషేధిత మందులు, నకిలీ ఉత్పత్తులపై కట్టడి చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా రాష్ట్రానికి సరఫరా అవుతున్న డ్రగ్స్‌ను నిరోధించేందుకు ప్రత్యేక పథకం అమలు చేయబోతున్నట్టు వెల్లడించారు.

కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో..
2023లో కేవలం 56 కేసులు నమోదు కాగా, 2024లో ఈ సంఖ్య 573కి చేరినట్లు మంత్రి వివరించారు. అనుమతి లేకుండా పనిచేస్తున్న మెడికల్ మరియు ఫార్మా కంపెనీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందుల కొనుగోలులో ప్రజల అవగాహన పెంపుదలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ రాందాన్, డిప్యూటీ డైరెక్టర్లు రాజవర్ధన్ చారి, పీ. సరళ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు గోవింద సింగ్ నాయక్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment