బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం (Video)

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

Summarize with AI

విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri Hill) కొలువైన కనకదుర్గమ్మకు (Kanaka Durga Goddess) తెలంగాణ భక్తులు (Telangana Devotees) బంగారు బోనం (Golden Bonam సమర్పించారు. భాగ్యనగర్ శ్రీమహంకాళి (Sri Mahankali) జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. గత 17 ఏళ్లుగా ప్రతి ఆషాఢ మాసంలో కమిటీ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తోంది.

బ్రాహ్మణవీధిలోని (Brahmin Street) జమ్మిదొడ్డి (Jammi Doddi) నుంచి మేళతాళాలు, కోలాటాలు, భేతాళ నృత్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. జోగిని అవిక (Jogini Avika)బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి నృత్యం చేస్తూ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం అమ్మవారికి బంగారు బోనంతో పాటు వెండి బోనం, సారె సమర్పించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో శీనానాయక్(Srinivas Naik), ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) కూడా బంగారు బోనం సమర్పణలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. తెలంగాణలో ఆషాఢ మాసం మహంకాళి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ఎల్‌నినో (El Nino) ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల్లో సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండి రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బోనం సమర్పించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment