రాజీనామా.. ‘ఎక్స్’లో ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘ లేఖ!

రాజీనామా.. ‘ఎక్స్’లో ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘ లేఖ!

Summarize with AI

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET-UG) పేపర్ లీక్ (Paper Leak) వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan), సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్'(X) (ట్విట్టర్)లో ఒక సుదీర్ఘ భావోద్వేగ లేఖను(Emotional Letter) విడుదల చేశారు. తన 40 ఏళ్ల ప్రజా జీవితాన్ని (Public Life), విద్యార్థుల (Students) పట్ల తనకున్న అంకితభావాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఆయన స్పష్టం చేశారు.

నాలుగు దశాబ్దాలకు పైగా విద్యార్థులు(Students), ఉపాధ్యాయులు (Teachers), విద్యా రంగ సంస్కరణలకు అంకితమయ్యానని తెలిపిన ప్రధాన్… ఒక బలమైన, సమ్మిళితమైన విద్యా వ్యవస్థే దేశానికి పునాది అని వ్యాఖ్యానించారు. “భారతదేశ యువతరం కలలను నెరవేర్చడం మనందరి నైతిక బాధ్యత. నీట్ వివాదం వెలుగుచూసిన మొదటి రోజు నుంచే నేను పూర్తి బాధ్యత తీసుకున్నాను, ఈ పరిస్థితి నుంచి ఎన్నడూ వెనుకాడలేదు” అని ట్విట్‌లో పేర్కొన్నారు.

2026 మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగుచూడగానే కేంద్ర ప్రభుత్వం (Central Government) వెంటనే స్పందించిందని, కేసును సీబీఐకి(CBI) అప్పగించి, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలకు తావులేకుండా ఉండేందుకు వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌ (CBT) విధానంలో నిర్వహిస్తామని వెల్లడించారు.

20 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తును (Students Future) దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం సహకారంతో జూన్ 21 నాటికి రీ-ఎగ్జామ్‌ను ప్రశాంతంగా పూర్తి చేశామని చెప్పారు. ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థికి అన్యాయం జరగకూడదన్నదే తన సంకల్పమని, జూలై 16న విడుదలైన ఫలితాల్లో పేద వర్గాలకు చెందిన ఎంతో మంది ప్రతిభావంతులు మంచి ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును (Students Future) కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు విద్యార్థులను కావాలని తప్పుదోవ పట్టించడానికి, అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారని ప్రధాన్ ఆరోపించారు. ఆ పరిణామాలు తానని తీవ్రంగా బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలో దేశానికి, విద్యా రంగానికి సేవ చేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖను ముగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment