యూరియా కోసం రైతుల కష్టాలు.. సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

యూరియా కోసం రైతుల కష్టాలు.. సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

Summarize with AI

తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) జరిగిన బీఆర్ఎస్(BRS) సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై (Pocharam Srinivas Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బాన్సువాడలో(Banswada) మరోసారి గులాబీ జెండా ఎగరేసే సమయం వచ్చిందని పేర్కొన్న ఆయన, బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పోచారం తన రాజకీయ భవిష్యత్తును తానే దెబ్బతీశారని ఆరోపించారు. “ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పార్టీ మారను” అని చెప్పి చివరకు మాట తప్పారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను (Promises) అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో కేసీఆర్‌ను(KCR) విమర్శించడానికే పరిమితమయ్యారని కేటీఆర్ అన్నారు.

రాష్ట్రంలో రైతులు(Farmers) యూరియా (Urea)కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎరువుల షాపుల్లో (Fertilizer Shops) యూరియా సంచులు అందుబాటులో లేకపోతే యాప్‌లో కనిపించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి (Delhi) మాత్రం సంచులు (Bags) ఉన్నాయి అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) రెండు పిల్లర్లు కుంగి 31 నెలలు గడిచినా మరమ్మతులు చేపట్టలేదని, కన్నెపల్లి (Kannepalli) నుంచి నీరు వృథాగా వెళ్లిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కు చేరుతుంటే ప్రభుత్వం మాత్రం “కోల్డ్ స్టోరేజ్”(Cold Storage)లోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేసిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment