2025కి శుభారంభం.. సీఎం రేవంత్‌, కేసీఆర్‌ శుభాకాంక్షలు

2025కి శుభారంభం.. సీఎం రేవంత్‌, కేసీఆర్‌ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మరియు మాజీ సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ప్రజల జీవితాల్లో శుభాలు, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.

ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా ఓ క‌విత రూపంలో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.

మరోవైపు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు. “2025 సంవత్సరంలో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని, కష్టసుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత అలవర్చుకోవాలని” తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడమే ముందుకు వెళ్లే దారి అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ తన సందేశంలో ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పెంపొందించడానికి మరింత కృషి చేయాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment