మద్యం మత్తులో అమ్మాయిలతో మంత్రి అనుచరుల చిందులు (Video)

మద్యం మత్తులో అమ్మాయిలతో మంత్రి అనుచరుల చిందులు

Summarize with AI

కూటమి ప్రభుత్వంలోని (Alliance Government) కొందరు ప్రజాప్రతినిధుల (Public Representatives) అనుచరులు, కార్యాలయ సిబ్బంది బరితెగిస్తున్నారు. అధికార బలంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ప్రభుత్వ(Government) పరువును బజారున పడేస్తున్నారు. తాజాగా కృష్ణా(Krishna) జిల్లా మచిలీపట్నం (Machilipatnam) (బందరు) లో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ముఖ్య అనుచరులు, ఆయన కార్యాలయ సిబ్బంది మద్యం మత్తులో అమ్మాయిలతో నగ్నంగా రికార్డింగ్ డ్యాన్స్‌లు వేస్తున్న వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

బందరులోని రాణిగారి (Ranigari) సెంటర్లో ఉన్న ఒక జ్యూయలరీ దుకాణం పైఅంతస్తులోని గదుల్లో ఈ వ్యవహారం నడిచింది. మంత్రి కొల్లు రవీంద్ర వ్యక్తిగత కార్యాలయంలో కీలక బాధ్యతల్లో పనిచేసే సైదారావు, హితేష్‌, ఆంజనేయులు అనే ముగ్గురు వ్యక్తులు ఈ నీచమైన పనికి ఒడిగట్టారు. గుడివాడ నుంచి అమ్మాయిలను ప్రత్యేకంగా రప్పించుకుని, గదుల్లో మద్యం మత్తులో మునిగితేలారు.

మద్యం మత్తులో ఉన్న మంత్రి అనుచరులు సైదారావ్(Saida Rao), హితేష్‌లు (Hitesh) అమ్మాయిలతో కలిసి నగ్నంగా ఆడిపాడారు. అసభ్యకర రీతిలో చిందులు వేశారు. అయితే, ఈ తతంగం అంతా అక్కడే ఉన్న మరో అనుచరుడు ఆంజనేయులు తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. డ్యాన్స్ చేస్తున్న సైదారావ్, హితేష్‌లను చూస్తూ.. “అక్కడ పట్టుకో.. ఇక్కడ పట్టుకో” అంటూ బూతు మాటలతో రెచ్చగొడుతూ, ఎంకరేజ్ చేస్తూ వీడియోలు తీశాడు.

మంత్రి కార్యాలయం సిబ్బంది, తాము చేస్తున్న పని సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందనే కనీస జ్ఞానం లేకుండా ఇలా అమ్మాయిలతో నగ్న నృత్యాలు చేయడంపై బందరు వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రికార్డింగ్ డ్యాన్స్‌లకు సంబంధించిన అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొల్లు రవీంద్ర కార్యాలయ సిబ్బంది ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల అండ చూసుకునే వీరు బందరు నడిబొడ్డున ఇలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment