మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345 కోట్ల అనుమతి

మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345 కోట్ల అనుమతి

Summarize with AI

హైదరాబాద్ రూపురేఖలను మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. మూసీ రివర్‌ఫ్రంట్ ఫేజ్-1 అభివృద్ధి పనులకు రూ.7,345.12 కోట్ల పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులను ఈపీసీ (EPC) విధానంలో చేపట్టనున్నట్లు వెల్లడించింది. మూసీ నది పునరుద్ధరణతో పాటు వరద నియంత్రణ, మురుగు నీటి శుద్ధి, నదీ తీరాల సుందరీకరణ, పర్యాటక అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.

మరోవైపు, మూసీ రివర్‌ఫ్రంట్ ఫేజ్-1 పనుల పురోగతిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించిన ఆయన, పనులను శాస్త్రీయ ప్రణాళికతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక ప్రమాణాలు, పర్యావరణ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మూసీ నది పరివాహక ప్రాంతం పూర్తిగా రూపాంతరం చెందడంతో పాటు హైదరాబాద్‌కు కొత్త గుర్తింపు తీసుకొస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment