బహ్రెయిన్‌లో స‌ముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

బహ్రెయిన్‌లో స‌ముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Summarize with AI

ఉపాధి (Employment) కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణకు(Telangana) చెందిన ఓ యువకుడు బహ్రెయిన్‌లో (Bahrain) విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ (Srinivas) బహ్రెయిన్‌లోని దుర్రత్ అల్ బహ్రెయిన్ (Durrat Al Bahrain) సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో నీట మునిగి మృతి చెందాడు.

సమాచారం అందుకున్న వెంటనే బహ్రెయిన్ కోస్ట్ గార్డు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో అక్కడి భారతీయులు, తెలంగాణ వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

శ్రీనివాస్ 2019 నుంచి బహ్రెయిన్‌లోని ఏంఏసీ (MAC) సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన విషయాన్ని కంపెనీ ప్రతినిధులు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ వార్తతో నిజామాబాద్‌లోని కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించి, అంత్యక్రియలు నిర్వహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయం (Embassy of India) చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment