యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై (Prashna Ravana) నమోదైన కేసులు, ఆయన రిమాండ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరుసగా కోర్టులు బెయిల్(Bail) మంజూరు చేసినప్పటికీ, చివరకు రాజద్రోహం (UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం ప్రజాస్వామ్యానికి(Democracy) మంచిది కాదని ఆయన విమర్శించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్(Prakash Raj).. “వరుసగా తప్పుడు కేసులు పెట్టి నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇస్తే, చివరకు రాజద్రోహం కేసు పెట్టి ఒక యూట్యూబర్‌ను రిమాండ్‌లోకి పంపిస్తారా? అధికారాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం (Sedition) కేసులు పెట్టడం సరైన విధానమా?” అని ప్రశ్నించారు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు వెరీ గుడ్ అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) సెటైర్లు వేశారు.
ఇలాంటి చర్యల వెనుక ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశమే కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఇక్కడితో ఆగదని, తర్వాత వ్యక్తిత్వ హననానికి (క్యారెక్టర్ అససినేషన్) ప్రయత్నాలు జరుగుతాయని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఇప్పటికే కొందరు జనసేన (Jana Sena Party) కార్యకర్తలు AI ఆధారంగా వీడియోలు రూపొందించి ప్రచారం ప్రారంభించారన్నారు. అలాగే స్వాధీనం చేసుకున్న రావణ్ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని వక్రీకరించి లీక్ చేస్తూ మానసికంగా వేధించే ప్రయత్నాలు జరిగే అవకాశముందని కూడా ఆయన అనుమానించారు.
“దిగజారండి… ఇంకా దిగజారుతూ ఉండండి. ఎంత కిందికి దిగజారుతారో ప్రజలు చూస్తూనే ఉంటారు. ఈ ఆటకు చివరికి తీర్పు చెప్పేది ప్రజలే” అంటూ ప్రకాశ్ రాజ్ తాను పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.
ప్రశ్న రావణ్ (Prashna Ravana) వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ సైతం రావణ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. రావణ్ అరెస్ట్.. బెయిల్.. వెంటనే అరెస్ట్ చేయడం.. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో హిడ్మాకు నివాళి అన్నందుకు రాజద్రోహం కేసు పెట్టడంపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మొదలుపెట్టిన మీ ఆటను.. ముగించేది ప్రజలే
— Telugu Feed (@Telugufeedsite) July 6, 2026
నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇస్తే, UAPA సెక్షన్‌తో ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా?
యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం.. వెరీ గుడ్.
నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్.. ఆల్రెడీ జన సైనికులు AI… https://t.co/dPxrTLqMfZ pic.twitter.com/PE82BVGaY5








