ఎంపీ అండ‌తో మళ్లీ ‘కాల్‌మనీ’ రాకెట్.. – సీఎంకు మాజీ ఎంపీ లేఖ

ఎంపీ అండ‌తో మళ్లీ 'కాల్‌మనీ' రాకెట్.. - సీఎంకు మాజీ ఎంపీ లేఖ

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘కాల్‌మనీ'(Call Money) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
బెజవాడ (Vijayawada) నగరంలో మరోసారి క్రూరమైన ‘కాల్‌మనీ’ మాఫియా కోరలు చాస్తోందని మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సాగుతున్న ఈ అక్రమ వసూళ్లు(Illegal Collections), వేధింపులపై (Harassment) ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి (Nara Chandrababu Naidu) ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఆయన ప్రధాన అనుచరుడు మూల్పూరి కిషోర్‌లపై (Mulpuri Kishore) నాని సంచలన ఆరోపణలు చేశారు.

విజయవాడకు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రి (Chagarla Gayatri) ఉదంతాన్ని కేశినేని నాని తన లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు. “బాధితురాలు గాయత్రి గతంలో రూ. 5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. దానికి సంబంధించి అసలు, వడ్డీ అన్నీ కలిపి మొత్తం రూ. 21 కోట్లు పూర్తిగా తిరిగి చెల్లించేశారు. అయినా సరే, ఎంపీ కేశినేని చిన్ని, ఆయన ప్రధాన అనుచరుడు ముల్పూరి కిశోర్ ఆమెను వదలకుండా తీవ్రంగా వేధిస్తున్నారు, బెదిరింపులకు గురిచేస్తున్నారు” అని నాని పేర్కొన్నారు.

బాధితురాలిని వేధించడమే కాకుండా, బాపులపాడు మండలంలో ఆమెకు ఉన్న 11 ఎకరాల విలువైన భూమిని(Land) అక్రమంగా దక్కించుకునేందుకు మాఫియా ప్రయత్నిస్తోందని లేఖలో ఆరోపించారు. ఫోర్జరీ (Forgery) (నకిలీ) పత్రాలను సృష్టించి, ఆ భూమిని కబ్జా చేయడానికి అధికారులపై ఎంపీ వర్గం తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోందని నాని మండిపడ్డారు.

బాధితురాలి ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేసిన నిందితులపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో FIR నంబర్ 174/2026 నమోదైనప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాజీ ఎంపీ ధ్వజమెత్తారు. ఎంపీ కార్యాలయం నుంచి వస్తున్న ఒత్తిళ్లు, అండదండల వల్లే పోలీసులు నిందితులను తాకడానికి కూడా భయపడుతున్నారని ఆయన విమర్శించారు.

విజయవాడ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసుల (Task Force Police) పనితీరుపై కూడా కేశినేని నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను కొందరు తమ ప్రైవేట్ గూండా సైన్యంగా మార్చుకున్నారని, అర్ధరాత్రి వేళల్లో అమాయక విజయవాడ పౌరులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న హ్యాబిచువల్ అఫెండర్ ముల్పూరి కిశోర్‌పై తక్షణమే “PD యాక్ట్” (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) ప్రయోగించి, జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

గతంలో 2015లో విజయవాడను కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారాన్ని గుర్తు చేస్తూ.. అప్పటిలాగే ఇప్పుడు కూడా అధికార గర్వంతో సాగుతున్న ఈ మాఫియా సామ్రాజ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే ఉక్కుపాదంతో అణచివేయాలని నాని కోరారు. బాధితురాలి కుటుంబానికి, ఆమె ఆస్తులకు రౌండ్-ది-క్లాక్ (24 గంటలు) (Round-the-Clock/24×7) పోలీస్ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment