ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh)మరోసారి భావ ప్రకటనా స్వేచ్ఛ, రాజకీయ విమర్శలు, పోలీసుల చర్యలపై తీవ్ర చర్చకు దారితీసిన ఘటన చోటుచేసుకుంది. ప్రశ్నించే పార్టీని వారి పరిభాషలోనే ప్రశ్నించిన యూట్యూబర్‌ను అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను (Prashna Ravana) ఏపీ (Andhra Pradesh) పోలీసులు అర్ధరాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.
గత రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో హైదరాబాద్‌లో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రశ్న రావణ్‌ను పిఠాపురం (Pithapuram) పోలీసులు అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్న రావణ్‌పై కక్ష సాధింపు చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై పెద్ద ఎత్తున స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్న రావణ్‌పై నమోదైన కేసు వివరాల ప్రకారం, ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రాధా మనోహర్ దాసులపై (Radha Manohar Das) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై జూన్ 29న జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ (Bojja Kumar) పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్ఎస్ (BNS – Bharatiya Nyaya Sanhita) చట్టంలోని సెక్షన్లు 196(1), 352, 356(2), 356(3), 111తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రశ్న రావణ్‌ను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని పిఠాపురంకు తరలిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ అరెస్టుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) ఆయన ఉపయోగించిన భాషలోనే కౌంటర్ ఇచ్చాడని, అందుకే అరెస్ట్(Arrest) చేశారంటూ పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
అదే సమయంలో, గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ(YSRCP) నేతలను ఉద్దేశించి “నా కొడకల్లారా… రండ్రా చూసుకుందాం… రాడ్లా… హాకీ స్టిక్సా…” అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాకినాడ సభలో కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) “వైసీపీ గూండా నాకొడకల్లారా” అంటూ వ్యాఖ్యానించినప్పుడు శాంతిభద్రతల అంశం గుర్తుకు రాలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? అదే తరహా భాషలో స్పందించిన యూట్యూబర్‌పై (YouTuber) మాత్రం కేసులు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరైన చర్యేనా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రశ్న రావణ్ అరెస్టుపై అధికారికంగా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉండగా, ఈ ఘటన రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.








