ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) రాయ్‌బరేలీ జిల్లా (Raebareli District) ఆస్పత్రిలో (Hospital) మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికి వచ్చిన మానసిక వికలాంగుడైన (Mentally Challenged) ఓ యువకుడిని కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలు (Sanitation Worker) కాలితో(Foot) తన్నుతూ దురుసుగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 39 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ఆమె పలుమార్లు రోగిని (Patient) కాలితో తన్నడంతో పాటు దూషించినట్లు కనిపించడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో రోగులతో ఇలాంటి అమానుష వైఖరి ఎలా ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు.
వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Government) వెంటనే స్పందించింది. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ (Brajesh Pathak) ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని, రోగుల పట్ల ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఆయన ఆదేశాల మేరకు రాయ్‌బరేలీ (Raebareli) చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంబంధిత మహిళా పారిశుధ్య కార్మికురాలిని తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనపై స్పందించిన అధికారులు, రోగుల భద్రత మరియు గౌరవానికి ఎలాంటి భంగం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ పుష్పేంద్ర కుమార్ (Pushpendra Kumar) మాట్లాడుతూ, వైరల్ వీడియోను సుమోటోగా స్వీకరించి సంబంధిత ఉద్యోగినిపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఘటనపై విచారణ కొనసాగుతోందని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ఆస్పత్రుల్లో రోగుల పట్ల సిబ్బంది వ్యవహారశైలిపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.








