ఏపీలో ఏంటీ విప‌రీత ప‌రిస్థితులు..

ఏపీలో ఏంటీ విప‌రీత ప‌రిస్థితులు..

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) శాంతిభద్రతల (Law and Order Situation) పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్ష్యాత్తు ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, మహిళలపైనే (Women’s) అమానుష దాడులు జరగడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా (Nellore District) కావలి నియోజకవర్గంలోని (Kavali Constituency) కచేరిమిట్టలో (Kacherimitta) జరిగిన ఒక దారుణ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. అధికార పార్టీ అండతో కొందరు నేతలు ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారనే దానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.

కచేరిమిట్టకు చెందిన ఒక గిరిజన మహిళపై (Tribal Woman) స్థానిక టీడీపీ(TDP) నేత ఇబ్రహీం (Ibrahim) అత్యంత ఘోరంగా ప్రవర్తించారు. బాధితురాలి కుమారుడు తన కుమార్తెను ప్రేమించాడనే నెపంతో, సదరు నేత రెచ్చిపోయాడు. గిరిజ‌న మ‌హిళ‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, కులం (Caste) పేరుతో నిందిస్తూ ఇంటి నుండి వీధిలోకి లాక్కొచ్చి.. గిరిజన మహిళను వివస్త్రను చేసి, రోడ్డుపైనే దారుణంగా చితకబాదాడు. పదిమందిలో సిగ్గుతో, అవమానంతో ఇంట్లోకి పరుగులు తీశానని బాధిత మ‌హిళ మాటలు వింటుంటే రాష్ట్రంలో మహిళల భద్రత ఎంతటి దయనీయ స్థితికి చేరిందో అర్థమవుతోంది.

ఈ అమానుష ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలికి పోలీసుల నుండి చేదు అనుభ‌వం ఎదురైంది. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి, రివర్స్‌లో కేసులు(Cases) పెడతామని పోలీసులు(Police) బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘోరం జరిగిన వారం రోజుల తర్వాత కానీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం శోచ‌నీయం. పైగా, “తప్పుడు కేసులు పెట్టి వేధిస్తాం.. నిన్ను, నీ ఇద్దరు కొడుకులను చంపేస్తాం” అంటూ బాధితురాలిని నిందితులు భయభ్రాంతులకు గురిచేస్తుండటం గమనార్హం.

టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లా అదోనిలో దళిత మహిళ మాల గంగమ్మ (Mala Gangamma) లాకప్ డెత్ (Lockup Death) ఆరోపణలు ఘటన మరువకముందే.. ఇప్పుడు నెల్లూరులో గిరిజన మహిళపై జరిగిన ఈ దాడి సంచలనంగా మారింది. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం అధికార పార్టీ నేతల్లో లోపించడం వల్లే ఇలాంటి విపరీత పరిస్థితులు తలెత్తుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్‌, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకువ‌చ్చింది. ప్రస్తుతం అవి ఏమయ్యాయన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment