తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో విజయ్, ప్రముఖ నటి త్రిష గురించి గత కొంతకాలంగా పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా, తాజాగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు మరోసారి చర్చకు దారితీశాయి. విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసినప్పటికీ, గతంలో ప్రత్యేకంగా విష్ చేసిన త్రిష ఈసారి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు చేయకపోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
అంతేకాకుండా, త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌ను అన్‌ఫాలో చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా అనే చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై విజయ్ లేదా త్రిష నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. దీంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనా, లేక వాటిలో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








