ఎట్టకేలకు ‘క్లిన్‌కార‌’ ఫేస్ రివీల్

ఎట్టకేలకు ‘క్లిన్‌కార‌’ ఫేస్ రివీల్

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని గత మూడేళ్లుగా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల గారాల పట్టి.. మెగా ప్రిన్సెస్ ‘క్లిన్‌కార కొణిదెల’ ముఖాన్ని తొలిసారిగా అభిమానుల‌కు పరిచయం చేశారు. నేడు క్లిన్‌కార పుట్టినరోజును పురస్కరించుకుని రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు అధికారికంగా ఆమె ఫేస్ రివీల్ చేస్తూ ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రామ్ చరణ్, ఉపాసన ఫొటోను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే క్లిన్‌కార.. అవర్ ప్రెషియస్ లిటిల్ వన్ ” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇప్పటివరకు క్లిన్‌కార ఫొటోలు ఎన్ని బయటకు వచ్చినా, ఎప్పుడూ ముఖం కనిపించకుండా ప్రైవసీ పాటిస్తూ వచ్చిన ఈ జంట.. ఈసారి మాత్రం ఫుల్ ఫేస్ చూపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. “అచ్చం నాన్న పోలికలే.. మెగా ప్రిన్సెస్ సూపర్ క్యూట్” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అంతా ఈ లిటిల్ యాంజెల్‌కు బర్త్‌డే విషెస్ చెప్తూ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment