రాష్ట్రంలో ఇటీవల తీవ్ర కలకలం రేపుతున్న డీఎస్సీ–2025 ఫలితాలు(DSC–2025 Results), నియామకాలపై(Recruitments) వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ ప్రక్రియలో అంతులేని అక్రమాలు జరిగాయని, దీని వెనుక దిగ్భ్రాంతికర రీతిలో “తండ్రీ కొడుకుల స్కామ్”(“Father-Son Scam”) దాగి ఉందని ఆరోపించారు. గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన డీఎస్సీ అక్రమాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. లక్షలాది మంది నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసిన ఈ కుంభకోణంపై(Scam) వెంటనే సీబీఐ (CBI) దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
జీఓలు మారుస్తూ స్పోర్ట్స్ కోటాలో అడ్డగోలు దోపిడీ!
గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడా కోటా (Sports Quota) ఉద్యోగాల భర్తీలో (Jobs Recruitment) నిబంధనలను తుంగలో తొక్కారని వైఎస్ జగన్(Ys Jagan) మండిపడ్డారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యూహాన్ని అమలు చేశారని ఆయన దుయ్యబట్టారు. నిబంధనలు మారుస్తూ కొత్తగా రెండు జీఓలను తీసుకొచ్చి, పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు భర్తీ చేశారని ఆరోపించారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించాల్సిన అవసరం లేకుండా.. కేవలం క్రీడా పోటీల్లో పాల్గొంటే చాలనే వింత నిబంధన పెట్టారన్నారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులను రూ.15 లక్షలు, రూ.20 లక్షలకు అమ్ముకున్నారని, అందుకు సంబంధించిన వీడియోను జగన్ బయటపెట్టారు.
ఆయా అభ్యర్థులకు సర్టిఫికెట్లు (Candidates) ఇచ్చిందీ పాలకుల అనుచరులేనని, వాటిని ధృవీకరించిందీ వారేనని జగన్ విమర్శించారు. చంద్రబాబు(Nara Chandrababu Naidu), లోకేష్(Nara Lokesh) తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి అన్ని గేట్లు ఓపెన్ చేసి, ఆ తర్వాత వెంటనే కొత్తగా మూడు జీఓలు తెచ్చి పాత జీఓలను రద్దు చేస్తూ గేట్లు క్లోజ్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

‘మెగా డీఎస్సీ’ పేరుతో పచ్చి దగా..
వైసీపీ ప్రభుత్వ హయాంలో (YSRCP Government) జరిగిన నియామకాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పనితీరును జగన్ పోల్చి చూపారు. “మా ప్రభుత్వంలో ఒకే విడతలో 1.30 లక్షల సచివాలయం ఉద్యోగాలను కేవలం 50 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి, 5 నెలల్లోనే భర్తీ చేశాం. ఎక్కడా రూపాయి అవినీతి కానీ, చిన్న ఆరోపణ కానీ రాలేదు” అని గుర్తు చేశారు.
చంద్రబాబు ‘మెగా డీఎస్సీ'(‘Mega DSC’) పేరుతో నిరుద్యోగులను పచ్చి దగా చేశారని మండిపడ్డారు. నోటిఫికేషన్ ఇచ్చిన 16 వేల ఉద్యోగాలలో 6 వేల ఉద్యోగాలు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినవేనని స్పష్టం చేశారు. వాటిని కావాలనే రద్దు చేసి, ఆలస్యం చేస్తూ.. ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ దానికి ‘మెగా’ అని కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

జెన్‌జీ అన్నీ చూస్తోంది.. రాష్ట్రంలో ‘కాక్రోచ్‌లు’ పుడతాయి
ప్రెస్ మీట్ ముగింపులో వైఎస్ జగన్ చేసిన సరికొత్త వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియా యుగంలో యువత (Gen Z, Gen Alpha) చాలా చురుగ్గా ఉందంటూ ఆయన ఆసక్తికరమైన పోలికను తీసుకొచ్చారు. “ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి. ఇప్పుడు ‘జెన్‌జీ’ (Gen Z) అంతా చూస్తోంది, ‘జెన్ ఆల్ఫా’ (Gen Alpha) కూడా వచ్చేసింది. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి లక్షలాది కాక్రోచ్‌లు (బొద్దింకలు) వచ్చేస్తాయి.. అన్నీ ఎండగడతాయి. రేపు రాష్ట్రంలోనూ అలాంటి కాక్రోచ్‌లు (Cockroaches) పుడతాయి, వస్తాయి. వాటిలో జగన్ కూడా ఒక కాక్రోచ్ (Cockroache) అవుతాడు” అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ సీఎం హెచ్చరించారు.








