ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్?

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కే. విజయానంద్ (1992) ఎంపిక అవ్వడం ఖాయం అయింది. ప్రస్తుత సీఎస్ ఈ నెల 31న ఉద్యోగ‌ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ తరువాత ఎవరు సీఎస్ అయ్యే దానికి అర్హులు అనే ప్ర‌శ్న‌కు చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. బీసీ ఓటు బ్యాంకు రాజకీయాలలో తన ప్రతిపాదనను బలోపేతం చేసుకునే దిశగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ కులస్తుడు అయిన విజయానంద్‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎంపిక చేసినట్లు సమాచారం.

రాజ‌కీయాల‌తో మారిన నిర్ణయం
సీనియారిటీ ప్రకారం 1990 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనంత రాము ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చీఫ్ సెక్రటరీగా పనిచేయడానికి గ‌ల అన్ని అర్హ‌త‌లు ఉన్నాయి. అయినా ఆయనకు ఈ అవకాశం ద‌క్క‌లేద‌ని తెలుస్తోంది. అనంత రాము కర్ణాటక వాసి కావడం, రాజకీయ పలుకుబ‌డి లేకపోవడం కారణంగా విజ‌యానంద్ ఎంపిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో 1991 బ్యాచ్‌కు చెందిన జి.సాయి ప్రసాద్ విజ‌యానంద్ త‌రువాత మ‌రో ఏడాది పాటు చీఫ్ సెక్రటరీగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment