ఏపీకి రెండ్రోజులు భారీ వ‌ర్షాలు.. 9 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ!

ఏపీకి రెండ్రోజులు భారీ వ‌ర్షాలు.. 9 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ!

Summarize with AI

గత కొన్ని రోజులుగా భానుడి భగభగలు, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Meteorological Department) తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను (Kerala) తాకనుండటంతో ఏపీలో వాతావరణం వేగంగా మారుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి, పగటి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభించనుంది.

ఆ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ హెచ్చరిక
రాష్ట్రంలో రాబోయే 24 నుంచి 48 గంటల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర (Coastal Andhra), రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో 9 జిల్లాలకు అధికారులు ‘ఎల్లో అలర్ట్’ (Yellow Alert) జారీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందరాదని అధికారులు సూచించారు.

తీరంలో వేటకు వెళ్లొద్దు
వర్షాలతో పాటు రాష్ట్రంలోని దక్షిణ కోస్తా తీరప్రాంతంలో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం విపరీతంగా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, రాగల రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా తీరంలోని మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment