‘పెద్ది’ సినిమాకు ఏపీ ప్రభుత్వం పెద్ద ఆఫ‌ర్

‘పెద్ది’ సినిమాకు ఏపీ ప్రభుత్వం పెద్ద ఆఫ‌ర్

Summarize with AI

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా న‌టిస్తున్న ‘పెద్ది'(Peddi) సినిమాకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం (Chandrababu Government) బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సన (Buchi Babu Sana) తెర‌కెక్కిస్తున్న‌ మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఈ సినిమాకు భారీ ఆఫర్ ప్రకటించింది. ‘పెద్ది’ చిత్రానికి ప్రత్యేక షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సాధారణంగా పెద్ద సినిమాలకు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున షోలకు అనుమతి ఇస్తుంటారు. కానీ ‘పెద్ది’ సినిమా కోసం చంద్రబాబు ప్రభుత్వం ఒక రోజు ముందే అంటే.. జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకే స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర కోసం గరిష్ఠ టికెట్ ధరను రూ. 600 (జీఎస్టీతో కలిపి) గా ప్రభుత్వం నిర్ణయించింది.

సినిమా విడుదల రోజు నుంచి మొదటి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు మేకర్స్‌కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతమున్న సాధారణ ధరలపై అదనంగా క్రింది విధంగా పెంచుకోవచ్చు. జూన్ 4 నుంచి 10 రోజులపాటు మల్టీప్లెక్స్‌లలో రూ.125, సింగిల్ స్క్రీన్లలో టికెట్ రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment