గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. తోపులాటతో హైడ్రామా!

గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. తోపులాటతో హైడ్రామా!

హైదరాబాద్‌లోని (Hyderabad) కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ (Gandhi Bhavan) బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. పార్టీ సీనియర్ నేత, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) పక్కన కూర్చోవడంపై కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్‌ఖాన్‌ (Feroz Khan), కార్వాన్ ఇన్‌చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల (Usman Al Hajri) మధ్య వాగ్వాదం చెలరేగింది. మొదట మాటల యుద్ధంగా ప్రారంభమైన ఈ వివాదం క్రమంగా తోపులాటకు దారి తీసింది. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకునే స్థాయికి వెళ్లిన ఈ ఘర్షణలో ఆగ్రహంతో ఉస్మాన్ ఫిరోజ్‌ఖాన్‌ను బలంగా తోసేయడంతో ఆయన కిందపడిపోయారు. సీనియర్ నేతల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి.

ఈ ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (V. Hanumantha Rao) వెంటనే జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆవేశంలో ఉన్న నేతలు ఆయనను కూడా పక్కకు నెట్టే ప్రయత్నం చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. వెంటనే అప్రమత్తమైన ఇతర కాంగ్రెస్ నాయకులు, భద్రతా సిబ్బంది మధ్యలోకి దిగి ఇరువర్గాలను విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాంధీభవన్‌లో జరిగిన ఈ రసాభాస ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment