రాజకీయాల్లో సెటైరికల్ ట్వీట్లు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో తనదైన మార్క్ ఉన్న వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కూటమి ప్రభుత్వంపై (Alliance Government) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరులో(Guntur) నిర్వహించిన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో (Statewide Protest Program) గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌కు (Nara Lokesh) ఒక కొత్త పేరు పెట్టారు.
ఆయన లోకేష్ కాదు.. ‘లవ్ క్యాష్’!
ధరల పెంపుపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ అంబటి రాంబాబు నారా లోకేష్‌ను టార్గెట్ చేశారు. “ఆయన పేరు లోకేష్ కాదు.. ఆయన పేరు ‘లవ్ క్యాష్’ (Love Cash)” అంటూ అంబటి సెటైర్లు పేల్చారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే రాష్ట్ర ట్యాక్స్‌లు తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు మాత్రం తగ్గించడం లేదని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని, చంద్రబాబు (Nara Chandrababu Naidu) చెప్తున్న సంపద సృష్టి, సుపరిపాలన అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.
పెట్రోల్ బంకుల వాళ్లు కమీషన్లు (Commissions) ఇవ్వరు కాబట్టే అక్కడ ధరలు తగ్గించడం లేదని, కేవలం కమీషన్లు వచ్చే పనులను మాత్రమే ప్రభుత్వం చేస్తోందని అంబటి తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేదన్నారు.
పిల్లల్ని కనమని చెప్పే నైతికత చంద్రబాబుకు ఉందా?
జనాభా నియంత్రణ (Population Control), పిల్లల్ని కనడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. “ముగ్గుర్ని కంటే రూ.30 వేలు, నలుగుర్ని కంటే రూ.40 వేలు ఇస్తామంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు, వాళ్ళ అబ్బాయి (లోకేష్) మాత్రం ఒక్కొక్కరినే కంటారు. మరి జనాన్ని మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పడానికి చంద్రబాబుకు ఏం నైతికత ఉంది?” అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.








