బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!

బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!

తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్(Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో (Floor Test) ఘన విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో అవసరమైన మెజార్టీకన్నా ఎక్కువ మద్దతు సాధిస్తూ విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం విజయ్(CM Vijay) బలనిరూపణకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం స్పీకర్ ఓటింగ్ (Speaker Voting) నిర్వహించారు. సాధారణ వాయిస్ ఓటింగ్‌కు భిన్నంగా ఒక్కో ఎమ్మెల్యే పేరు పిలుస్తూ వారి ఓటును నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఈ ఓటింగ్‌లో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 22 మంది సభ్యులు ఓటు వేశారు. మరోవైపు సభలో ఉద్రిక్తతల మధ్య 61 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. తమిళగా వెట్రి కజగం (TVK) ప్రభుత్వానికి కాంగ్రెస్, విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు మద్దతు ప్రకటించాయి. అలాగే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయడం గమనార్హం.

మరోవైపు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), అన్నాడీఎంకేలోని (AIADMK) ఎడప్పాడి కె. పళనిస్వామి (Edappadi K. Palaniswami) వర్గం, అలాగే పట్టాలి మక్కల్ కచ్చి (PMK) పార్టీలు విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచాయి. ఈ విజయంతో తమిళనాడులో విజయ్ నాయకత్వానికి మరింత బలం చేకూరినట్లయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment