ప‌వ‌న్‌ను అస‌హ్యించుకుంటున్న క్యాడ‌ర్ – సంచ‌ల‌న వీడియో

ప‌వ‌న్‌ను అస‌హ్యించుకుంటున్న క్యాడ‌ర్ - జనసైనికుడి సంచ‌ల‌న వీడియో

తమిళనాడు(Tamil Nadu) న‌టుడు, టీవీకే (TVK)అధినేత ద‌ళ‌ప‌తి (Thalapathy Vijay) విజ‌యం ఏపీలో కాక‌రేపుతోంది. ముఖ్యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) టార్గెట్‌గా ట్రోల్స్‌, మీమ్స్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుండ‌గా, తాజాగా జ‌నసేన పార్టీ నేత‌లు ఆ పార్టీ అధ్య‌క్షుడి తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ జనసేన (Janasena Party) ఇంచార్జ్ కోనేటి హరి రాయల్(Koneti Hari Royal), పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో టీవీకే (TVK) పార్టీ విజయంతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్‌ని చూసి ఏం నేర్చుకున్నారు?
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ హరి రాయల్(Hari Royal) పవన్ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. “అక్కడ విజయ్ సీఎం అయ్యారు, వాళ్ల అభిమానులు ఆనందంతో డాన్స్ చేస్తున్నారు. కానీ మీరు సీఎం ఎలాగూ అవ్వలేరు, కనీసం మేము డాన్స్ చేసే పరిస్థితి కూడా లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ వెనుక ఎలాంటి కులం లేదని, కానీ పవన్ కళ్యాణ్ వెనుక ఒక కులం ఉందని, కేవలం ఆ కులం కోసమే తాము ఆయన వెంట నడుస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కార్యకర్తలు అంటరానివాళ్లా?
పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలను పవన్ కళ్యాణ్ కలవకపోవడంపై హరి రాయల్ మండిపడ్డారు.”కనీసం మమ్మల్ని కలవడానికి మీకు సమయం ఉండదా? మేమేమన్నా అంటరానివాళ్ళమా?” అని నిలదీశారు. జనాల్లో పార్టీ మీద నమ్మకం పోయిందని, నాయకులకు సమాజంలో కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందారు. పార్టీ నిర్మాణం చేపట్టకుండా, కేవలం సోషల్ మీడియాలో ‘100% స్ట్రైక్ రేట్’ (Strike Rate) అని చెప్పుకోవడం దేనికి పనికిరాదని విమర్శించారు.

వీరుడు అనుకుంటే.. బానిసలను చేశాడు
పవన్ కళ్యాణ్ ఏదో వీరుడు, శూరుడు లాగా ప్రజలను ఆదుకుంటారని భావించామని, కానీ ఆయన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని హరి రాయల్ సెల్ఫీ వీడియోలు వెల్ల‌డించారు. “మమ్మల్ని బానిసలుగా ఎందుకు చేస్తున్నారు? మా మీద మాకే అసహ్యంగా ఉంది” అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్‌పై, సొంత పార్టీ నాయకుడే ఈ స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. దీనిపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment