ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నాయకత్వంపై స్పష్టత ఇచ్చింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, రాబోయే ఎన్నికల్లో కూడా ఆయనే పార్టీ ముఖచిత్రంగా ఉంటారని స్పష్టం చేశారు. యోగి నేతృత్వంలోనే బీజేపీ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అదే సమయంలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నాయకత్వంలో “మిషన్ 2027” (Mission 2027) పేరుతో తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోవైపు నితిన్ నబీన్ మాట్లాడుతూ, ఒకప్పుడు నేరాలు, దోపిడీలకు కేంద్రంగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి, ఎక్స్‌ప్రెస్‌వేలు మరియు మెరుగైన శాంతిభద్రతలతో గుర్తింపు పొందిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), సీఎం యోగి (CM Yogi) నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంటూ, ప్రజల అవసరాలు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాలే బీజేపీకి(BJP) మూడోసారి అధికారం తీసుకువస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.








పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్