పిఠాపురంలో నాగబాబు.. వ‌ర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్‌

పిఠాపురంలో నాగబాబు.. వ‌ర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్‌

Summarize with AI

రాష్ట్రంలో పిఠాపురం (Pithapuram) రాజకీయాలు మ‌రీ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నియోజకవర్గంలో టీడీపీ-జనసేన (TDP-Janasena) మధ్య ఫ్లెక్సీల రగడ సాగుతున్న తరుణంలో, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక జనసేన నేతలతో భేటీ అయిన నాగబాబు, టీడీపీ నేత వర్మ (Varma) తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్పందించాల్సిన అవసరం లేదు
పిఠాపురంలో టీడీపీ(TDP) నేత వర్మ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, నాగబాబు చాలా వ్యూహాత్మకంగా స్పందించారు. “వర్మ వివాదంపై మనం స్పందించాల్సిన అవసరం లేదు. పిఠాపురంలో ఏవైనా విభేదాలు ఉంటే వాటిని పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. మా నాయకుడు (పవన్ కళ్యాణ్) (Pawan Kalyan) ఏం చెబితే అదే మాకు ఫైనల్. మేమంతా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం” అని స్పష్టం చేశారు.

పరోక్షంగా ‘వర్మ’పై కౌంటర్
గతంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. “పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా భ్రమలో ఉంటే, అది వారి ఖర్మ మాత్రమే” అని నాగబాబు అప్పట్లో పరోక్షంగా వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజాగా ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదని వర్మ రచ్చ చేయడంపై నాగబాబు పార్టీ అధిష్టానం పేరు ముందు పెట్టారు.

చంద్రబాబే తప్పుబట్టారు.. ఇక మీరెవరు?
ఫ్లెక్సీ వివాదంపై స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వర్మ తీరును తప్పుబట్టినట్లు వార్తలు వచ్చాయి. కూటమిలో భాగంగా ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయొద్దని చంద్రబాబు (Chandrababu) వారించినా, వర్మ అతిగా ప్రవర్తించడంపై సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. “సీటు త్యాగం చేశానని పదే పదే చెప్పుకుంటూ, లేని వివాదాలను కొనితెచ్చుకుంటున్న వర్మకు ఇది ‘ఖర్మ’ కాక మరేమిటి?” అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment