తమిళనాడు ఎన్నికల ప్రచారం.. విజయ్‌ చేతిలో జగన్‌ ఫోటో!

తమిళనాడులో అనూహ్య దృశ్యం.. విజయ్‌ చేతిలో జగన్‌ ఫోటో!

తమిళనాడులో (Tamil Nadu) జరిగిన తాజా ఎన్నికల ప్రచార సభలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. టీవీకే(TVK) అధినేత విజయ్‌(Vijay)ప్రచార రథంపై మాట్లాడుతూ, అనూహ్యంగా వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి(YS Jagan Mohan Reddy) సంబంధించిన ఫొటోను ప్రదర్శించడం సభలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో అక్కడున్న ప్రజల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతోంది. విజయ్‌ చేతిలో జగన్‌ ఫొటో కనిపించిన క్షణంలోనే సభలో “జగన్.. జగన్” అనే నినాదాలు మార్మోగినట్లు వీడియోల్లో కనిపిస్తోంది.

రాజకీయ వేదికపై ఇలా ఒక రాష్ట్ర నాయకుడిపై మరో రాష్ట్రంలో అభిమానం వ్యక్తమవడం చర్చనీయాంశంగా మారింది. అభిమానుల స్పందన సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో, ఆ క్షణం ఎన్నికల వాతావరణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని నాయకుల మధ్య గౌరవ భావానికి ఉదాహరణగా చూస్తుండగా, మరికొందరు రాజకీయ సందేశంగా విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా, విజయ్‌ ప్రచార సభలో జగన్ పేరు మార్మోగడం మాత్రం ఈ ఎన్నికల ప్రచారంలో హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment