ఇండియా, ఆస్ట్రేలియా ఆఫర్లకు ‘నో’ చెప్పిన అఫ్గానిస్థాన్ ప్లేయర్

ఇండియా, ఆస్ట్రేలియా ఆఫర్లకు ‘నో’ చెప్పిన అఫ్గానిస్థాన్ ప్లేయర్

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రషీద్ ఖాన్ (Rashid Khan) మరోసారి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన విషయాలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇండియా (India), ఆస్ట్రేలియా (Australia) దేశాల నుంచి పౌరసత్వ ఆఫర్లు వచ్చినప్పటికీ, తాను మాత్రం అఫ్గానిస్థాన్‌కే (Afghanistan) కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు. 2023 ఐపీఎల్ సమయంలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తరఫున ఆడుతున్నప్పుడు ఒక బీసీసీఐ(BCCI) ఉన్నతాధికారి తనను భారత్‌లో స్థిరపడమని సూచించారని తెలిపాడు. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పి, అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా, ఆ ఆఫర్‌ను ఎంతో గౌరవంగా తిరస్కరించినట్లు రషీద్ వెల్లడించాడు.

‘నా దేశం తరఫునే ఆడటం నా గర్వం. ఒకసారి అఫ్గానిస్థాన్ కోసం ఆడలేని పరిస్థితి వస్తే, మరే ఇతర దేశం తరఫున కూడా ఆడను’ అని రషీద్ ఖాన్ చెప్పిన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురి చేశాయి. ఇదే తరహాలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆఫర్‌ను కూడా తిరస్కరించినట్లు తెలిపారు. ఆయన ఈ నిర్ణయం తన దేశం పట్ల ఉన్న నిబద్ధతను, అంకితభావాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పటివరకు అఫ్గానిస్థాన్ తరఫున 6 టెస్టులు, 117 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్, తన ప్రతిభతోనే కాకుండా తన విలువలతో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment