చంద్రబాబుకు నితీష్, షిండేల గతే పడుతుంది.. – రేవంత్‌ సంచలనం

చంద్రబాబుకు నితీష్, షిండేల గతే పడుతుంది.. - రేవంత్‌ సంచలనం

బీజేపీతో (BJP) పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా అదే బాటలో ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ జాతీయ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీతో జతకట్టిన పార్టీల మనగడ భవిష్యత్తులో అత్యంత కష్టతరంగా మారుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. “ప్రస్తుతం నితీష్ కుమార్ (Nitish Kumar), ఏక్ నాథ్ షిండేల (Eknath Shinde) పరిస్థితి ఎలా ఉందో.. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు కాబట్టే టీడీపీకి(TDP) ప్రాధాన్యత ఇస్తున్నారు. రేపు బీజేపీకి బలం పెరిగితే టీడీపీని కరివేపాకులా తీసి పక్కన పడేస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు.

డిక్టేటర్‌షిప్‌ను ఎవరూ ఒప్పుకోరు!
పార్లమెంటులో చట్టాల రూపకల్పనపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని రేవంత్ స్పష్టం చేశారు. “లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభలు (Rajya Sabha) చట్టాలు చేయడానికి మాత్రమే ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయాల్సింది క్షేత్రస్థాయిలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం. 2/3 మెజారిటీ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది చట్టం చేయలేం. ప్రధాని పదవిలో ఉన్న వారు తమకు మెజారిటీ ఉందని తమను తాము రాజులుగా భావించి చట్టాలు చేసుకుంటే ప్రజలు ఒప్పుకోరు” అని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయని, అంత మాత్రాన చంద్రబాబు తనకు తాను రాజుగా ప్రకటించుకుని ఇష్టానుసారంగా చట్టాలు చేస్తానంటే ప్రజలు అంగీకరించరని ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అంశంపై రేవంత్ రెడ్డి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే. అయితే అది 2011 జనాభా లెక్కల ప్రకారమే జరగాలి” అని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదనే సంకేతాన్ని పంపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment