పార్లమెంటు (Parliament) వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విసిరిన ఒక చిన్న ‘నంబర్’ బాణం (Small Number Arrow) ఇప్పుడు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో (NDA alliance) పెను తుఫాను రేపుతోంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (131st Constitutional Amendment Bill) వీగిపోయిన నేపథ్యంలో, రాహుల్ ప్రస్తావించిన ’16’ అనే సంఖ్య వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అది ప్రధాని మోదీకి (Modi) హెచ్చరికా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఏమిటా 16 మిస్టరీ?
సభలో ప్రధాని మోదీ ముఖంలో నీరసం కనిపిస్తోందని ఎద్దేవా చేసిన రాహుల్, తన ఫోన్‌లో తేదీ చూడగా అది ఏప్రిల్ 16 అని కనిపించిందని, ఆ సంఖ్యలోనే అన్ని సమాధానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై క్లూ కావాలంటే ఎవరైనా తనను ట్యాగ్ చేయొచ్చని సవాల్ విసిరారు.
రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ 16 వెనుక మూడు ప్రధాన కోణాలు ఉన్నాయంటున్నారు. లోక్‌సభలో (Lok Sabha) ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి లైఫ్ లైన్‌గా ఉన్నది తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) చెందిన 16 మంది ఎంపీలే. ఆ 16 మంది అటు ఇటు అయితే కేంద్ర ప్రభుత్వం (Central Government) కుప్పకూలడం ఖాయమని రాహుల్ పరోక్షంగా హెచ్చరించినట్లు భావిస్తున్నారు.
పార్లమెంటులో చర్చ జరుగుతుండగానే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని (Women Reservation Act) ప్రభుత్వం హడావిడిగా నోటిఫై చేసిన తేదీ ఏప్రిల్ 16. సభను తక్కువ చేసి చూపిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి పతనానికి నాంది అని రాహుల్ ధ్వజమెత్తారు. లేదా.. 131వ సవరణ బిల్లు వీగిపోవడంలో టీడీపీ ఎంపీలు ఏమైనా గోడ దూకారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీకి చెందిన అనుకూల మీడియా ఛానల్ కూడా ఇదే కోణాన్ని వినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనంగా మారింది.
16 ఎంపీలు!!!
— The Samosa Times (@Samotimes2026) April 17, 2026
చిక్కుముడి విప్పిన రాహుల్ గాంధీ !!
టీడీపీ ను అనుమానిస్తున్న మహా వంశీ !!! pic.twitter.com/qVRekqQ02x
టీడీపీపై అనుమానాలు.. రేవంత్ రెడ్డి ఎంట్రీ!
రాహుల్ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా గడిచిన 24 గంటల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండ్రోజులు లోక్‌సభలో బిల్లుపై ఉత్కంఠ నెలకొన్న సమయంలోనే ఏపీకి చెందిన కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సన్నిహితంగా ఫోటోలు దిగడం చర్చనీయాంశమైంది. బిల్లు వీగిపోయిన తరువాత ఇవాళ ఉదయం ఎన్డీయే ఎంపీల బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఒంటరిగా హాజరు కావడం చూస్తుంటే, టీడీపీ-కాంగ్రెస్ మధ్య రహస్య అవగాహన ఉందా? అనే అనుమానాలు ఎన్డీయే వర్గాల్లో మొదలయ్యాయి. 2014 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాల తరువాత బీజేపీని(BJP) వీడి కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు. ఆ తరువాతి ఎన్నికల్లో ఓడిపోయారు.
2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో చేరినా.. రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్‌తో కొనసాగుతున్న సత్సంబంధాల దృష్ట్యా చంద్రబాబు ఏ క్షణమైనా నిర్ణయం మార్చుకోవచ్చనే అర్థం వచ్చేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.








