Airtel నెట్‌వ‌ర్క్ ప్రాబ్ల‌మ్‌.. వినియోగదారులు ఆందోళన

Airtel నెట్‌వ‌ర్క్ ప్రాబ్ల‌మ్‌.. వినియోగదారులు ఆందోళన

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఈరోజు ఉదయం నుండి దేశ వ్యాప్తంగా వినియోగదారులను తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. నెట్‌వ‌ర్క్ సమస్యల వల్ల చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో కాల్స్ చేయడం, మెసేజులు పంపడం, అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయలేకపోయారు.

ఈ సమస్య గురించి వినియోగదారులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ఇంటర్నెట్ పనిచేయడం లేదు, నా ఫోన్‌లో నెట్‌వ‌ర్క్ సిగ్నల్ కూడా కనిపించడం లేదు” అంటూ చాలామంది తమ సమస్యను పంచుకున్నారు.

డౌన్ డిటెక్టర్లో ఉదయం 10:30 గంటల నుంచే నెట్‌వ‌ర్క్ సమస్యలపై నివేదికలు రావడం ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఎయిర్‌టెల్ అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వినియోగదారులు, సమస్య త్వరగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment