21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.. సీఎం పదవికి నితీష్ రాజీనామా

21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.. సీఎం పదవికి నితీష్ రాజీనామా

బిహార్(Bihar) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేసారు. కేబినెట్ సమావేశం (Cabinet Meeting) అనంతరం గవర్నర్‌ను (Governor) కలిసి రాజీనామ అందజేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేగంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. తొలిసారిగా బీజేపీ(BJP) తరఫున ముఖ్యమంత్రి ఎంపిక కావచ్చన్న ఊహాగానాలు కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

కొత్త ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి(Samrat Choudhary), నిత్యానంద్ రాయ్ (Nityanand Rai), రేణు దేవి (Renu Devi) వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు బిహార్ రాజకీయ సమీకరణాలను గణనీయంగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో తదుపరి రాజకీయ దిశపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment