విజ‌య్ సినిమా విడుదలకు సిద్ధ‌మా?

‘జన నాయగన్’ విడుదల కి సిద్ధం కానుందా?

Summarize with AI

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదల కోసం అభిమానులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి లో విడుదల చేయాలని చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ చిత్రంలోని కొన్ని కీలక రాజకీయ డైలాగులు మరియు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు (Censor Board) అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులో ఉన్న కొన్ని పెండింగ్ ఇష్యూస్ వల్ల నిర్ణీత సమయానికి సినిమా విడుదల కాలేదు.

ముఖ్యంగా తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రభావం సినిమాపై పడకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 24న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ తేదీన సినిమాను విడుదల చేయడం ద్వారా ఎన్నికల వేడిలో ఉన్న ప్రజలను థియేటర్లకు రప్పించవచ్చని భావిస్తున్నారు. మరి సెన్సార్ అడ్డంకులు దాటుకుని ‘జన నాయగన్’ చెప్పిన తేదీకే వస్తుందో లేదో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment