సల్మాన్ హీరోయిన్‌గా నయన్.. భారీ యాక్షన్ డ్రామా

సల్మాన్ – నయనతార కలయికలో భారీ యాక్షన్ డ్రామా

Summarize with AI

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan), నేషనల్ అవార్డ్ విజేత దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా #SVC63లో ఇప్పుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా చేరారు.

‘జవాన్’ సినిమా తర్వాత బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నయనతార, సల్మాన్ ఖాన్‌తో జత కట్టడం ఈ ప్రాజెక్ట్ కోసం భారీ హైప్ క్రియేట్ చేసింది. టాలీవుడ్, బాలీవుడ్ మేళవింపుతో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యంత అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది.

దర్శకుడు వంశీ పైడిపల్లి తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు, కాబట్టి నయనతార పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా, కథను మలుపు తిప్పేలా రూపొందించబడింది. మేకర్స్ ఈ సూపర్ స్టార్ కాంబినేషన్ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారు, కాబట్టి సల్మాన్ – నయనతార క్రేజీ పేయింగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చెబుతున్నారు. ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment