అఫ్గానిస్థాన్లో పాకిస్థాన్ చేపట్టిన వరుస ఎయిర్ స్ట్రైక్స్ తీవ్ర విషాదానికి దారితీశాయి. పక్టికా ప్రావిన్సులోని బార్మల్ జిల్లాలో జెట్స్ ద్వారా బాంబులతో చేసిన దాడుల్లో చిన్నపిల్లలు, మహిళలతో సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.
ఈ దాడులపై పాకిస్థాన్ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే, అఫ్గాన్ బార్డర్ వద్ద తాలిబన్లు దాక్కున్నారనే నెపంతో ఈ దాడులు జరిగినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పెద్ద కలకలం రేపుతోంది. ఇటువంటి చర్యలు మానవ హక్కుల ఉల్లంఘనగా భావిస్తూ అంతర్జాతీయ సమాజం ఎలా స్పందించబోతుందో వేచిచూడాలి.








