అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు..15 మంది అమాయకుల మృతి!

అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు..15 మంది అమాయకుల మృతి!

Summarize with AI

అఫ్గానిస్థాన్‌లో పాకిస్థాన్ చేపట్టిన వరుస ఎయిర్ స్ట్రైక్స్ తీవ్ర విషాదానికి దారితీశాయి. పక్టికా ప్రావిన్సులోని బార్మల్ జిల్లాలో జెట్స్ ద్వారా బాంబులతో చేసిన దాడుల్లో చిన్నపిల్లలు, మహిళలతో సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

ఈ దాడులపై పాకిస్థాన్ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే, అఫ్గాన్ బార్డర్ వద్ద తాలిబన్లు దాక్కున్నారనే నెపంతో ఈ దాడులు జరిగినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పెద్ద కలకలం రేపుతోంది. ఇటువంటి చర్యలు మానవ హక్కుల ఉల్లంఘనగా భావిస్తూ అంతర్జాతీయ సమాజం ఎలా స్పందించబోతుందో వేచిచూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment