తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో (Telangana Assembly lobbies) మల్లారెడ్డి (Malla Reddy) మార్కు వినోదం మరోసారి చోటుచేసుకుంది. రాజకీయాలు, వ్యక్తిగత బంధాలు, చివరకు సినిమా వేషాల వరకు మల్లారెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
“రేవంత్ సీఎం కావాలని నేనే చెప్పా!”
అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా ముచ్చటించిన మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డి గురించి సంచలన కామెంట్స్ చేశారు. “రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే. గతంలో జరిగిన ఒక రెడ్డి సామాజికవర్గ సమావేశంలో రేవంత్ తప్ప మరో పవర్‌ఫుల్ నాయకుడు ఈ వర్గంలో లేడని నేనే స్వయంగా చెప్పాను. ఎవరు అవునన్నా, కాదన్నా నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే” అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్‌లో విలన్ ఛాన్స్.. కానీ!
రాజకీయాల నుంచి సినిమాల వైపు టాపిక్ మళ్లడంతో మల్లారెడ్డి తన సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తనను అడిగారని వెల్లడించారు. “ఆ సినిమాలో విలన్ పాత్ర చేయమని హరీష్ శంకర్ అడిగారు. కానీ నేను వద్దు అని చెప్పేశాను. నాకు సినిమాల్లో కేవలం ముఖ్యమంత్రి పాత్ర మాత్రమే చేయాలని ఉంది” అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.
“నువ్వు విలన్ పాత్రకే కరెక్ట్” – తలసాని సెటైర్లు
మల్లారెడ్డి మాటలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు. “మల్లారెడ్డి.. నువ్వు సినిమాల్లో చేస్తే విలన్ పాత్రే చెయ్. నీకు విలన్ పాత్రే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది” అంటూ సెటైర్లు వేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.








